![]() |
![]() |

ఉపద్రష్ట సునీత అంటే చాల పెద్ద పేరైపోతుందేమో కానీ సింగర్ సునీతా అంటే సింపుల్ గా క్యూట్ గా ఉంటుంది. సునీత సాంగ్స్ ని ఎంతోమంది వీరాభిమానులు ఉన్నారు. అలాంటి సునీతకు ఇద్దరు పిల్లలు. ఆకాష్, శ్రేయ..ఆకాష్ ని హీరోని చేసింది అలాగే శ్రేయని సింగర్ ని చేసింది సునీత. సునీతకు కొంచెం టైం దొరికింది అంటే పిల్లలతో, నేచర్, మ్యూజిక్ తో ఇన్వొల్వె ఐపోతుంది.
అలాంటి సునీత తన పిల్లలతో కలిసి బీచ్ లో దిగిన ఫోటోని చిల్డ్రన్స్ డే సందర్భంగా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అలాగే "పేరెంటింగ్ అంటే వాళ్ళను పోషించడం, నేర్పించడం, నేర్చుకోవడం. నేను నా పిల్లల విషయంలో చాల సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నా పిల్లలు దయగల వాళ్ళు, ప్రతిభావంతులు ఇంకా గ్రౌండ్ తో ఎర్త్. ఇలాంటి బ్లేస్డ్ చిల్డ్రన్ దొరకడం నా అదృష్టం...ఒక తల్లిగా, వారు ఎంత పెద్దవారైనప్పటికీ, నేను వారికు ఎప్పుడు రక్షణ కవచంగా ఉంటాను.
వాళ్ళు చేసే పనుల్లో చాల సపోర్ట్ గా నిలబడతాను. ఆకాష్, శ్రేయతో పాటు పిల్లలందరినీ ప్రేమిస్తున్నాను. " అని కాప్షన్ పెట్టుకున్నారు. సునీత కొడుకు ఆకాష్ "సర్కారు నౌకరి" అనే మూవీలో నటించాడు. టాలీవుడ్ లో సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న సునీత సాంగ్స్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గ ఉండిపోతాయి. ఇక ఈమె 2021 లో మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని రెండవ వివాహం చేసుకున్నారు. సునీత పెళ్లి విషయంలో అప్పట్లో సోషల్ మీడియాలో ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. కానీ వాటిని ఏమాత్రం పట్టించుకోని సునీత తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈమె తన పిల్లలతో, తన మ్యారేజ్ లైఫ్ తో చాల హ్యాపీగా ఉన్నారు..
![]() |
![]() |